10-25-2009, 07:23 AM
Excell2007 లో ఒక నేమ్ లిస్ట్ ను డ్రాప్ డౌన్ లిస్ట్ గా ఎలా మార్చాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.
ఈ క్రింది లిస్ట్ ను డ్రాప్ డౌన్ లిస్ట్ గా మార్చేద్దాం.

1. లిస్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్కొని రైట్ క్లిక్ చేయండి. పాపప్ మెనూలో Name a Range ని క్లిక్ చేయండి.

2. New Name విండోలో Name ఇన్ పుట్ బాక్స్ లో "సభ్యులు" అని టైప్ చేసి OK ను క్లిక్ చేయండి.

3. ఆ లిస్ట్ మొత్తానికి మీరు సెట్ చేసిన సభ్యులు అనే నేమ్ ఈ విధంగా కనిపిస్తుంది.

4. ఒక ఖాళీ సెల్ ను క్లిక్ చేసి Data >> Data Validation ను క్లిక్ చేయండి.

5. క్రింద గ్రీన్ కలర్ లో హైలెట్ చేసిన సెట్టింగ్స్ చేసి OK ను క్లిక్ చేయండి. (Source సభ్యులు అని టైప్ చేసేటపుడు దాని ముందు తప్పనిసరిగా = ఉపయోగించండి.)

మీరు తయారు చేసిన డ్రాప్ డౌన్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది.
